న్యూఢిల్లీ, జూన్ 20: భారత దేశపు చిన్న ఉపగ్రహ ప్రయోగ వాహనం (ఎన్‌ఎస్‌ఎల్‌వీ) తయారీ బిడ్‌ను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) దక్కించుకుందని ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ తెలిపింది.
ఈ కాంట్రాక్టు విలువ 511 కోట్ల రూపాయలని తెలిపింది. కాగా ఈ బిడ్డింగ్‌లో హెచ్ఏఎల్ కన్సార్టియంలో భాగంగా కాకుండా సోలోగానే పాల్గొని టెండర్ దక్కించుకుంది.