Jawed Habib | జావెద్ హబీబ్ గురించి తెలుసు కదా. ఆయన ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్. అలాగే బిజినెస్‌మ్యాన్ కూడా. ఆయనకు దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్స్ ఉన్నాయి. హెయిర్ అండ్ బ్యూటీ మీద జావెద్ హబీబ్ ట్రెయినింగ్ సెషన్స్ కూడా ఇస్తూ ఉంటాడు. దేశవ్యాప్తంగా పేరుగాంచిన వ్యక్తులలో ఒకరైన జావెద్ తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నాడు.
హెయిర్ కట్ చేస్తూ తన తల మీద జావెద్ ఉమ్మేశాడంటూ ఓ మహిళ తాజాగా ఆయనపై ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో జావెద్ హెయిర్ అండ్ బ్యూటీ మీద ట్రెయినింగ్ ఇస్తున్నాడు. ఒక మహిళను స్టేజ్ మీదికి తీసుకొచ్చి.. తనను కుర్చీలో కూర్చోబెట్టి తనకు హెయిర్ కట్ చేశాడు జావెద్. అదే సమయంలో ట్రెయినింగ్ సెషన్‌కు వచ్చిన వాళ్లు అందరూ చూస్తుండగానే ఆమె తలపై ఉమ్మేశాడు జావెద్. దీంతో అక్కడున్న వాళ్లు అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
పూజా గుప్తా అనే మహిళకు స్టేజ్ మీదికి ఇలా అవమానించడంతో ఆ మహిళ అతడి ప్రవర్తనకు చాలా బాధపడినట్టు వీడియోలో పేర్కొంది. ఆయన పెద్ద హెయిర్ స్టైలిస్ట్ కాబట్టి.. ఆయన ట్రెయినింగ్ సెషన్‌కు వెళ్లా. నన్ను స్టేజ్ మీదికి పిలిచి.. ఒకవేళ మీ దగ్గర నీళ్లు లేకపోయినా సరే.. ఇలా ఉమ్మేసి కొంతవరకు హెయిర్ కట్ చేయొచ్చు అంటూ నా తల మీద ఉమ్మేశాడు. దీంతో నాకు ఏం చేయాలో అర్థం కాలేదు.. అంటూ ఆ మహిళ వీడియోలో పేర్కొన్నది.
For those who goes to Javed Habib's saloon pic.twitter.com/dblHxHUBkw
— Rishi Bagree (@rishibagree) January 5, 2022
నెటిజన్లు కూడా జావెద్ చేసిన పనికి సీరియస్ అవుతున్నారు. ఒక సెలబ్రిటీ అయి ఉండి.. వందల సెలూన్లకు అధిపతి అయి ఉండి.. ఇలా ప్రవర్తించడం ఏంటి అంటూ నెటిజన్లు జావెద్‌పై సీరియస్ అవుతున్నారు.
So this is what #JavedHabib spit fiasco is all about: Habib seems to be an arrogant man who, when asked some questions by Puja Gupta during his seminar, told her he runs 900 salons whereas she runs just 1. Then, to humiliate her further, he called her on stage & spit in her hair pic.twitter.com/V4l2fA6Vbu
— Swati Goel Sharma (@swati_gs) January 6, 2022
Ms. Pooja's response pic.twitter.com/QKvyoMlCHU
— Kungfu Pande 🇮🇳2.0 (@pb3060) January 6, 2022