న్యూఢిల్లీ: టాటా గ్రూప్ మాజీ చైర్పర్సన్ రతన్ టాటా (Ratan Tata) మరణం పట్ల మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం సంతాపం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్న వారితో నిజం మాట్లాడే ధైర్యమున్న వ్యక్తి అని కొనియాడారు. టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్‌కు రాసిన లేఖలో మన్మోహన్ సింగ్ తన విచారాన్ని వ్యక్తం చేశారు. రతన్ టాటాను భారతీయ పరిశ్రమకు ప్రముఖుడిగా ప్రశంసించారు. చాలా సందర్భాల్లో ఆయనతో సన్నిహితంగా పనిచేసిన తనకు చాలా మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయని మన్మోహన్ సింగ్ గుర్తు చేసుకున్నారు. ‘ఆయన వ్యాపార చిహ్నం కంటే చాలా ఎక్కువ. ఆయన దృష్టి, మానవత్వం ఆయన స్థాపించిన అనేక స్వచ్ఛంద సంస్థల పనిలో కనిపిస్తుంది’ అని పేర్కొన్నారు.
కాగా, అధికారంలో ఉన్న వారితో నిజాలు చెప్పే ధైర్యం ఉన్న వ్యక్తి రతన్ టాటా అని మన్మోహన్ సింగ్ కొనియాడారు. ‘అధికారంలో ఉన్న వ్యక్తులతో నిజం మాట్లాడే ధైర్యం ఆయనకు ఉంది. అనేక సందర్భాల్లో ఆయనతో చాలా సన్నిహితంగా పనిచేసిన జ్ఞాపకాలు నాకు ఉన్నాయి. ఈ విచారకరమైన సందర్భంలో నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేయడానికి నేను ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నా. ఆయన ఆత్మకు శాంతి కలగాలి’ అని తన సంతాప లేఖలో పేర్కొన్నారు.
Former Prime Minister Dr. Manmohan Singh writes letter to N. Chandrasekaran, Chairman of Tata Sons, expressing grief over the demise of #RatanTata.#ManmohanSingh | #letter | #TataSons pic.twitter.com/8ZyLHKTC8I
— All India Radio News (@airnewsalerts) October 10, 2024