న్యూఢిల్లీ : గుర్గావ్లో గ్రనేడ్లు కలకలం సృష్టించాయి. సెక్టార్ 31లోని ఓ ఇంట్లో రెండు హ్యాండ్ గ్రనేడ్లు, కాట్రిడ్జ్‌లు దొరికాయని పోలీసులు మంగళవారం తెలిపారు. సెక్టార్ 31లోని సీఎన్జీ పెట్రోల్ పంప్ సమీపంలోని ఖాళీ భవనంలో అక్రమంగా దారించినట్లు ఆధాయులు, మందుగుండు సామగ్రి దాచి ఉంచినట్లు సమాచారం అందుకున్న పోలీసులు మంగళవారం ఉదయం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఇంతకు ముందే రోజే అక్కడ ముగ్గురు వ్యక్తులు హత్యకు గురయ్యారు. ఎవరూ లేని ఇంటోల్ హ్యాండ్ గ్రనేడ్, డిటోనేటర్లు దాచి ఉంచారనే సమాచారంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (క్రైమ్) రాజీవ్ దేస్వాల్ ఆధ్వర్యంలో పోలీస్ బృందాలు, బాండ్ స్క్వాడ్ ఆ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు. అదే సమయంలో అటువైపుగా వచ్చే వాహనాలను మళ్లించారు. అయితే, పోలీస్ అధికారులు వివరాలను వెల్లడించేందుకు నిరాకరించారు. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని పేర్కొన్నారు.