డెహ్రాడూన్: శీతాకాలం ప్రారంభం కావడంతో దేశమంతటా ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నాయి. కొద్దికొద్దిగా చలి పెరుగుతున్నది. ఇక హిమాలయ ప్రాంతాలకు సమీపంలోని జమ్ముకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో చలి తీవ్రత మరింత ఎక్కువైంది. చలికతోడు విపరీతంగా మంచు కూడా కురుస్తున్నది. ఉత్తరాఖండ్ రాష్ట్రం చమోలీ జిల్లాలోని గురుద్వారా హేమకుంద్ సాహిబ్ పరిసరాల్లో మందమైన తెల్లటి దుప్పటి పరిచినట్లుగా మంచు పేరుకుపోయింది.
కాగా, మంచు కారణంగా గురుద్వారా హేమకుంద్ సాహిబ్ ప్రతి ఏడాది శీతాకాలంలో మూసివేస్తారు. అదేవిధంగా ఈ ఏడాది కూడా హేమకుంద్ సాహిబ్ ద్వారాలను మూసివేశారు.
Uttarakhand: Gurudwara Hemkund Sahib in Chamoli district covered under a thick blanket of snow. The portals of the Gurudwara are closed for the winter season. pic.twitter.com/uwGDMAKl9E
— ANI (@ANI) October 22, 2021