గాంధీనగర్: మద్య నిషేధం అమలవుతున్న గుజరాత్ మత్తు గుప్పిట జోగుతున్నది. గత రెండేండ్లలో రాష్ట్రంలో రూ.4,058 కోట్ల విలువైన డ్రగ్స్, రూ.211 కోట్ల లిక్కర్‌ను అధికారులు సీజ్ చేశారు. స్వయంగా ఆ రాష్ట్ర ప్రభుత్వమే ఈ విషయాన్ని శాసనసభలో వెల్లడించింది.
డ్రగ్స్, లిక్కర్ కేసులతో సంబంధం ఉన్న సుమారు 3 లక్షల మందిని అరెస్టు చేసినట్టు ఆ రాష్ట్ర హోంమంత్రి హర్ష్ సంఘవి వెల్లడించారు. ఒక్క వడోదరలోనే 1,620 కోట్ల విలువైన డ్రగ్స్, లిక్కర్‌ను సీజ్ చేశామని, ఈ జాబితాలో ఆ జిల్లా టాప్‌లో ఉందని పేర్కొన్నారు.