అహ్మదాబాద్: గుజరాత్లో వరుస ప్రమాదాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవల మోర్బీలోని కేబుల్ వంతెన కుప్పకూలి 142 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనను మరువకముందే.. తాజాగా డామన్‌లోని దభేల్ ఏరియాలో శ్రీ గణేశ్ ప్యాకేజింగ్ పేరుతో ఉన్న ఓ ప్యాకేజింగ్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
అయితే, ఈ ప్రమాదంలో ఆస్తి నష్టమే తప్ప ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కాగా, అంతకుముందు ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. మంటలు భారీగా ఎగిసిపడుతుండటంతో 8 ఫైరింజన్ల సాయంతో వాటిని ఆర్పేశారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Gujarat | Massive fire in a company named Ganesh Packaging in Dabhel area of Daman. More than 8 fire engines on the spot, efforts on to control the fire. Further details awaited. pic.twitter.com/yLnDaFrCKg
— ANI (@ANI) November 4, 2022