రాజ్‌కోట్, ఆగస్టు 31: మానసిక పరిస్థితి సరిగ్గా లేని తల్లిని కోపంలో చంపేసిన 21 ఏండ్ల కుమారుడు ‘సారీ అమ్మ నిన్ను చంపేశా’ అంటూ తల్లి శవంతో ఇన్‌స్టాలో ఫొటో పెట్టిన ఘటన గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో చోటుచేసుకుంది.
యూనివర్సిటీ రోడ్‌లోని భగత్సింగ్జీ గార్డెన్లో నీలేశ్ గోసాయ్ అనే యువకుడు తల్లి జ్యోతిబెన్ గోసాయ్ (48) తో కలిసి నివసిస్తున్నాడు. ఏదో విషయమై తల్లితో గొడవపడిన నీలేశ్ ఆమెపై కత్తితో దాడి చేశాడు. దానిని ఆమె అడ్డుకోవడంతో దుప్పటితో ఆమె గొంతు నులిమి హత్య చేశాడు.
తర్వాత ఆమె మృతదేహం పక్కన కూర్చుని సెల్ఫీ తీసుకుని ‘సారీ అమ్మ.. నిన్ను చంపేశా.. నిన్ను మిస్ అవుతున్నాను..నా జీవితాన్ని కోల్పోయాను.. ఓం శాంతి’ అని ఇన్‌స్టాలో పోస్టులు పెట్టాడు. స్థానికుడొకరు పోలీసులకు సమాచారం అందించడంతో వారు వచ్చి నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడు నేరాన్ని అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు.