సూరత్, మే 30: ‘బాబోయ్.. నా భార్య పెట్టే వేధింపులను తట్టుకోలేక పోతున్నాను. దయ చేసి నా కారుణ్య మరణానికి అనుమతించండి’ అంటూ ఒక భార్య బాధితుడు గుజరాత్‌లోని సూరత్ అధికారులకు మొరపెట్టుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. సూరత్‌కు చెందిన కిరీట్ పటేల్‌కు 2024లో స్థానికంగా ఉన్న ఒక మహిళతో పెండ్లి అయ్యింది.
వీరిద్దరికి కూడా ఇది మూడో వివాహం. పెండ్లి అయినప్పటి నుంచి తన భార్య, అత్త నిత్యం తనను డబ్బు కోసం ఒత్తిడి చేస్తూ తీవ్రంగా వేధిస్తున్నారని కారుణ్య మరణానికి అనుమతించాలని కలెక్టర్‌కు పంపిన లేఖలో విజ్ఞప్తి చేశాడు.