అహ్మదాబాద్: భార్య మానసికంగా పెడుతున్న హింసను తాళలేక గుజరాత్‌కు చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు కారణమైన తన భార్యకు గుణపాఠం చెప్పాలంటూ కుటుంబ సభ్యులను కోరుతూ వీడియో చేశాడు. ఈ మేరకు మృతుడి తండ్రి బొటడ్ జిల్లా పోలీసులకు శనివారం ఫిర్యాదు చేయడంతో వారు మృతుడి భార్యపై కేసు నమోదు చేశారు.
జామర్ధ వల్లగే నివాసి సురేష్ భాయ్ సాథ్లియా తన సమీప గ్రామానికి చెందిన జయను వివాహం చేసుకున్నాడు. అయితే పెళ్లయినప్పటి నుంచి భార్య అతనితో గొడవ పెట్టుకుంటూ తరచూ పుట్టింటికి వెళ్లిపోయేది. ఇటీవల అదే తరహాలో పుట్టింటికి వెళ్లిన జయ ఇక తాను అత్తింటికి వచ్చేది లేదంటూ తెగేసి చెప్పింది. దీంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన సురేష్ ఆత్మహత్య చేసుకున్నాడు.