Fire Accident | గుజరాత్లోని ఆరావళిలో ఓ బాణసంచా కంపెనీలో భారీగా అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతువాతపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో నలుగురు మాత్రమే ఉందని సమాచారం ఉందని అధికారులు పేర్కొన్నారు. అయితే, అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. ఫ్యాక్టరీలో పేలుడు జరుగడంతో బాణాసంచ భారీ శబ్దంతో పేలిపోయాయి. భారీగా పొగ కమ్ముకుంది. అయితే, ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో నలుగురు మాత్రమే ఉన్నారని సమాచారం అందిందని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఆరావళి జిల్లా ఎస్పీ సంజయ్ ఖరత్ తెలిపారు. అగ్నిమాపక అధికారి దిగ్విజయ్ సింగ్ గాధ్వి మాట్లాడుతూ భారీ అగ్నిప్రమాదం గురించి సమాచారం అందిందని, వెంటనే సిబ్బంది బృందం వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుందని, మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు.
#WATCH | A massive fire breaks out at a firecracker company in Aravalli district of Gujarat. Two fire tenders present at the spot. Further details awaited. pic.twitter.com/2oOnSHfpjk
— ANI (@ANI) April 20, 2023