ఉద్యోగం నుంచి తొలగించాడన్న కోపంతో ఫ్యాక్టరీ యజమాని హత్య
Crime news | గుజరాత్ రాష్ట్రం సూరత్ జిల్లాలో దారుణం జరిగింది. తమను ఉద్యోగం నుంచి తొలగించాడన్న కోపంతో ఓ ఫ్యాక్టరీలో పనిచేసే ఇద్దరు కార్మికులు ఏకంగా
అహ్మదాబాద్: గుజరాత్ రాష్ట్రం సూరత్ జిల్లాలో దారుణం జరిగింది. తమను ఉద్యోగం నుంచి తొలగించాడన్న కోపంతో ఓ ఫ్యాక్టరీలో పనిచేసే ఇద్దరు కార్మికులు ఏకంగా ఆ ఫ్యాక్టరీ యజమానినే హత్యచేశారు. అతనితోపాటు అడ్డొచ్చిన మరో ఇద్దరిని కూడా చంపేశారు. మృతుడి కుటుంబం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితులిద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. సూరత్ జిల్లాలోని ఆమ్రోలీ పోలీస్‌స్టేషన్ పరిధిలోగల వేదాంత ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులలో ఇద్దరు ఇటీవల ఆ ఫ్యాక్టరీ యజమానితో గొడవ పెట్టుకున్నారు. దాంతో యజమాని ఆ ఇద్దరు కార్మికులను ఫ్యాక్టరీ ఓనర్ విధుల నుంచి తొలగించాడు. దాంతో అతనిపై కక్ష పెంచుకున్న కార్మికులిద్దరూ పథకం ప్రకారం హత్యచేశారు. అడ్డుకోబోయిన మరో ఇద్దరిని కూడా చంపేశారు.
ఫ్యాక్టరీ యజమానిని హత్య చేసిన కేసులో నిందితులు ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారని సూరత్ డీసీపీ చెప్పారు. నిందితుల్లో ఒకరు మైనర్ అని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

