Godhra riot Cases | గోద్రా అల్లర్ల కేసుల్లో మరో 35 మందిని నిర్దోషులుగా ప్రకటించిన గుజరాత్ కోర్టు
Godhra riot Cases | గోద్రా అల్లర్లకు సంబంధించిన నాలుగు కేసుల్లో (Godhra riot Cases) నిందితులైన మరో 35 మందిని నిర్దోషులుగా గుజరాత్ కోర్డు ప్రకటించింది. గోద్రా అల్లర్లు ప్రణాళిక ప్రకారం జరుగలేదని పేర్కొంది.
అహ్మదాబాద్: గోద్రా అల్లర్లకు సంబంధించిన నాలుగు కేసుల్లో (Godhra riot Cases) నిందితులైన మరో 35 మందిని నిర్దోషులుగా గుజరాత్ కోర్డు ప్రకటించింది. గోద్రా అల్లర్లు ప్రణాళిక ప్రకారం జరుగలేదని పేర్కొంది. కాగా, నాలుగు కేసులకు సంబంధించి 52 మంది వ్యక్తులు నిందితులుగా ఉన్నారు. అయితే ఈ కేసుల విచారణ కాలంలో 17 మంది చనిపోయారు. దీంతో మిగతా 35 మంది నిందితులను నిర్దోషులుగా పంచమహల్ జిల్లాలోని హలోల్ పట్టణంలోని కోర్టు ప్రకటించింది. 21 ఏళ్ల కిందట జరిగిన గోద్రా అల్లర్లకు సంబంధించిన నాలుగు కేసుల విచారణను ముగించింది. ఈ అల్లర్లలో ముగ్గురిని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న నిందితులకు వ్యతిరేకంగా సాక్ష్యాలు సమర్పించడంలో పోలీసులు విఫలమైనట్లు కోర్టు పేర్కొంది. ఈ నెల 12న రిజర్వ్ చేసిన తీర్పును గురువారం వెల్లడించింది.
కాగా, గోద్రా అల్లర్లు ప్రణాళికాబద్ధంగా జరిగినట్లు రాజకీయ నేతలు, మీడియా చేసిన ఆరోపణలు తప్పంటూ కోర్టు మండిపడ్డింది. ఈ కేసుల విచారణలో ఇది నిర్ధారణ కాలేదని తెలిపింది. నిందితుల నుంచి మారణాయుధాలు స్వాధీనం చేసుకోలేదని, వారికి వ్యతిరేకంగా సాక్ష్యాలు సేకరించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైనట్లు ఆరోపించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

