కరోనాను జయించిన మహిళ.. ఆరున్నర నెలల తర్వాత ఇంటికి
Gujarat: Corona infected woman discharged from hospital after 202 days, was infected in second wave

అహ్మదాబాద్ : దాదాపు ఆరున్నర నెలల పాటు కరోనాపై పోరాడి మహిళ ఎట్టకేలకు ఆసుప్రతి నుంచి డిశ్చార్జి అయ్యింది. గుజరాత్‌లోని దాహోద్‌కు చెందిన గీతా ధార్మిక్ (45) కరోనా సోకడంతో ఈ ఏడాది మే 1న ఆసుప్రతిలో చేరింది. అప్పటి నుంచి ఆ మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వస్తున్నది. 202 రోజుల తర్వాత ఆమె శనివారం డిశ్చార్జి అయ్యింది. ఆమె భర్త దాహోద్‌లోని రైల్వేలో ఉద్యోగం చేస్తున్నారు.
కరోనా సెకండ్ వేవ్ సమయంలో భోపాల్ నుంచి తిరిగి వచ్చిన సమయంలో గీతకు కరోనా వైరస్ సోకినట్లు మహిళ భర్త తెలిపారు. కరోనా బారినపడ్డ మహిళ 202 రోజుల పాటు దాహోద్‌తో పాటు వడోదరలోని ఆసుపత్రిలో చికిత్స పొందారని, వెంటిలేటర్, ఆక్సిజన్‌పై ఉంచి చికిత్స అందించారన్నారు. అయితే, చికిత్స సమయంలో తొమ్మిది సార్లు గీత ఆరోగ్య పరిస్థితి విషమించిందని ఆయన చెప్పారు.
గీత తల్లి మరణించగా.. ఏప్రిల్ 23న భోపాల్‌కు వెళ్లారు. 25న దాహోద్‌కు తిరిగి వచ్చాక తన భార్యకు కరోనా లక్షణాలు కనిపించగా.. మే 1న పాజిటివ్‌గా తేలిందని ఆమె భర్త తెలిపారు. అదే రోజు రాత్రి దాహోద్‌లోని రైల్వే ఆసుపత్రిలో చేర్పించామని పేర్కొన్నారు. ఎట్టకేలకు తన భార్య కోలుకొని ఇంటికి రావడంతో కుటుంబంలో సంతోషం నెలకొందని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

