మంచులో ఇరుక్కుపోయిన 25 మంది గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యేలు
ఉత్తరాఖండ్ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన గుజరాత్ బీజేపీకి చెందిన 25 మంది ఎమ్మెల్యేలు మంచులో ఇరుక్కుపోయారు. అయితే తామంతా క్షేమంగానే ఉన్నామని ఎమ్మెల్యే దుష్యంత్ పటేల్ ప్రకటించారు. ఉత్తరాఖండ్ ఎన్నికల్లో భాగంగా గుజరాత్కు చెందిన 25 మంది ఎమ్మెల్యేలకు బీజేపీ అధిష్ఠానం ప్రచార బాధ్యతలు అప్పజెప్పింది. అల్మోరా, జాగేశ్వర్ ప్రాంత బాధ్యతలు వీరికి అప్పజెప్పింది. అయితే రెండు రోజులుగా అల్మోరాలో విపరీతమైన మంచు కురుస్తోంది. దీంతో ఈ 25 మంది ఎమ్మెల్యేలు ఈ మంచులో ఇరుక్కుపోయారు. దీనిపై ఎమ్మెల్యే దుష్యంత్ పటేల్ మాట్లాడుతూ..
‘ఉత్తరాఖండ్ ఎన్నికల్లో భాగంగా మా 25 మందికి అల్మోరా, జాగేశ్వర్లో ప్రచారం చేయాలని అధిష్ఠానం ఆదేశించింది. అల్మోరాలో విపరీతమైన మంచు కురుస్తోంది. దీంతో మేం మధ్యలోనే ఆగిపోయాం. అల్మోరా, జాగేశ్వర్ ప్రాంతాల్లో విపరీతంగా మంచు కురుస్తోంది. రోడ్డు మొత్తం మంచుతో కప్పబడింది. రెండు రోజులుగా ఇలా మంచు పడుతూనే వుంది. అయితే తాము క్షేమంగానే వున్నాం. మా మా ప్రచార స్థలాలకు చేరుకున్నాం’ అని దుష్యంత్ పటేల్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | కోల్కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

