అహ్మదాబాద్ : గుజరాత్‌కు చెందిన ఓ బీజేపీ ఎమ్మెల్యే ఫైర్ ఇంజిన్‌ను పిలిపించి తన ఇంటిని కడిగిస్తున్న వీడియోలు వైరల్ అయ్యాయి. దహోడ్ జిల్లా దేవ్‌గఢ్ బరియా నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే బచుభాయ్ ఖబడ తన ఇంటికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫైర్ ఇంజిన్‌ను పిలిపించి కడగమనడంతో అగ్నిమాపక సిబ్బంది షాక్ అయ్యారు.
ఈ ఘటనపై దేవ్‌గఢ్ మున్సిపల్ కార్పొరేషన్ చైర్పర్సన్ ధర్మేష్ కలాల్ మాట్లాడుతూ.. తనను ఎమ్మెల్యే ఫైర్ ఇంజిన్‌ను పంపమని అడిగింది నిజమేనని అంగీకరించారు. కానీ ఇంటిని కడగమని చెప్పినట్టు సిబ్బంది ఉన్నతాధికారులకు తెలియజేయడంతో.. శుభ్రపరిచే పనిని కొద్దిసేపటికే ఆపేసినట్టు వెల్లడించారు. ఇందుకు గాను ఎమ్మెల్యే నుంచి 2,700 వసూలు చేశామన్నారు. కాగా ఈ వీడియోలపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.