BJP MLA | బీజేపీ ఎమ్మెల్యేపై లైంగికదాడి కేసు.. హైకోర్టు ఆదేశాలపై నమోదుచేసిన పోలీసులు
గుజరాత్లో అధికార పార్టీ ఎమ్మెల్యేపై (BJP MLA) లైంగిక దాడి కేసు నమోదయింది. హైకోర్టు ఆదేశాలతో బీజేపీ ఎమ్మెల్యేపై, మాజీ మంత్రి గజేంద్ర సిన్హ్ పర్మార్‌పై పోలీసులు కేసు నమోదుచేశారు.
గాంధీనగర్: గుజరాత్లో అధికార పార్టీ ఎమ్మెల్యేపై (BJP MLA) లైంగిక దాడి కేసు నమోదయింది. హైకోర్టు ఆదేశాలతో బీజేపీ ఎమ్మెల్యేపై, మాజీ మంత్రి గజేంద్ర సిన్హ్ పర్మార్‌పై పోలీసులు కేసు నమోదుచేశారు. 2020 జూలై 30న గాంధీనగర్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్‌కు తనను పిలిపించుకున్నారని, పెండ్లి చేసుకుంటానని నమ్మబలికి లోబర్చుకున్నారని దళిత బాధితురాలు ఆరోపించింది. ఆ తర్వాత తన ఫోన్‌కాల్స్‌కు ఆయన స్పందించలేదని, తమ మధ్య సంబంధం ఉన్న విషయం ఎవరికైనా చెబితే కిడ్నాప్ చేసి, చిత్రహింసలు పెడతానంటూ కులం పేరుతో దూషించారని పేర్కొంది. ఈ మేరకు ఆమె అందజేసిన ఫిర్యాదును పోలీసులు పట్టించుకోకపోవడంతో 2021లో హైకోర్టును ఆశ్రయించారు.
విచారణ చేపట్టిన న్యాయస్థానం పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పర్మార్‌పై వెంటనే అత్యాచారం కేసు నమోదు చేయాలని ఆదేశించింది. దీంతో గాంధీనగర్ సెక్టార్-21 పోలీస్‌స్టేషన్ పోలీసులు అత్యాచారం, పోక్సో తదితర కేసులు పెట్టారు. ఇప్పటికే అతనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదయింది. అదేవిధంగా రాజస్థాన్‌లో మైనర్ బాలికను అపహరించిన కేసులో రాజేంద్రసిన్హ్ నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌ను గుజరాత్ హైకోర్టు 2023, ఏప్రిల్‌లో తిరస్కరించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

