పబ్లిక్ సర్వెంట్ల విచారణకు ముందస్తు అనుమతిపై మార్గదర్శకాలు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: పబ్లిక్ సర్వెంట్లపై అవినీతి, ఇతర నేరారోపణలు వచ్చినప్పుడు పోలీసులు విచారణ చేపట్టాలంటే ముందస్తు అనుమతి అవసరం. ఈ మేరకు 1988 నాటి అవినీతి నిరోధక చట్టానికి మూడేండ్ల కిందట ప్రభుత్వం సవరణ తెచ్చింది. ఇప్పుడు ఆ సవరణకు సంబంధించి అనుసరించాల్సిన ప్రామాణిక నిర్వహణ పద్ధతులను (ఎస్వోపీ) కేంద్రం జారీ చేసింది. విచారణ, దర్యాప్తులో అన్నిచోట్లా ఒకే విధానాన్ని పాటించేలా చూడటమే ఎస్వోపీ లక్ష్యమని పేర్కొంది. ఈ ఆదేశాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యదర్శులకు పంపంది. పోలీసు అధికారికి అందిన సమాచారాన్ని ఎలా దశలవారీగా ప్రాసెస్ చేసుకోవాలి, ఎవరు ఎవర్ని ముందస్తు అనుమతిని కోరాలి తదితర వివరాలను పొందుపర్చారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ రంగ బ్యాంకుల (బోర్డు స్థాయి) చైర్పర్సన్లు, మేనేజింగ్ డైరెక్టర్లకు సంబంధించి డైరెక్టర్ జనరల్ లేదా ఆ హోదాకు సమానస్థాయి అధికారి ముందస్తు అనుమతి కోరాల్సి ఉంటుందని ఎస్‌వోపీలో కేంద్రం స్పష్టం చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

