హైదరాబాద్ : హైదరాబాద్‌లో భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్(బీవీఎస్) సంస్థ పెట్టుబడులు పెట్టనుంది. జీనోమ్ వ్యాలీలో రూ. 200 కోట్లతో టీకాల తయారీ కేంద్రాన్ని బీఎస్వీ గ్లోబస్ సంస్థ ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఆ సంస్థ ఎండీ సంజీవ్ నావన్ గుల్.. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ను ప్రగతి భవన్లో కలిసి ప్రకటించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చినందుకు ఎండీ సంజీవ్ నావన్ గుల్కు కేటీఆర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ చర్యతో ప్రపంచంలోనే వ్యాక్సిన్ హబ్‌గా హైదరాబాద్ నగరం తన స్థానాన్ని సుస్థిరం చేసుకుందని కేటీఆర్ పేర్కొన్నారు.
Glad to announce that @BSV_Global decided to announce that they will set up state of the art injectable & vaccine manufacturing facility in @GenomeValley with an investment of ₹200Cr
Thanks to MD of BSV @SanjivSnavangul Ji. This will consolidate Hyd as vaccine Hub of the world pic.twitter.com/XeBO6A8QDP
— KTR (@KTRTRS) April 12, 2022