న్యూఢిల్లీ, మార్చి 5: ఉత్తరాఖండ్‌లో నకిలీ సంస్థలు, బిల్లులు సృష్టించి అక్రమంగా కలప వ్యాపారం చేస్తున్న పలువురు ప్యాపారుల సిండికేట్ గుట్టును జీఎస్టీ అధికారులు రట్టు చేశారు. కోట్లాది రూపాయల పన్ను ఎగవేసినట్టు గుర్తించారు.
డిజిటల్ ట్రాకింగ్, ఎలక్ట్రానిక్ నిఘా ద్వారా ఈ అక్రమ దందాను చేధించినట్టు జీఎస్టీ విభాగం అధికారులు ఆదివారం వెల్లడించారు. ఉదమ్‌సింగ్ నగర్ జిల్లాలోని జాస్పూర్ ఏరియాలో నడుస్తున్న ఈ రాకెట్‌ను వెలుగులోకి తెచ్చేందుకు ‘ఆపరేషన్ డీ డే-రైజింగ్ వుడ్స్’ అనే పేరుతో ఓ ఆపరేషన్ నిర్వహించారు. ఉదమ్‌సింగ్ నగర్‌కు అతిపెద్ద కలప మార్కెట్‌గా పేరున్నది. ఇక్కడి నుంచే దేశంలోని చాలా ప్రాంతాలకు కలప, దాని ఉత్పత్తులు సరఫరా అవుతుంటాయి.