బుధవారం 03 మార్చి 2021
National - Feb 23, 2021 , 15:41:34

జీఎస్టీ కిందికి పెట్రోల్‌, డీజిల్‌.. నిర్ణ‌యం వాళ్ల‌దే: పెట్రోలియం మంత్రి

జీఎస్టీ కిందికి పెట్రోల్‌, డీజిల్‌.. నిర్ణ‌యం వాళ్ల‌దే: పెట్రోలియం మంత్రి

న్యూఢిల్లీ: పెరిగిపోతున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌కు క‌ళ్లెం వేయాలంటే వాటిని గూడ్స్ అండ్ స‌ర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) కిందికి తీసుకురావ‌డ‌మే స‌రైన‌ద‌ని అంద‌రూ భావిస్తున్న‌దే. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ కూడా ఇదే చెప్పారు. ఇప్పుడు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ కూడా అదే మాట అంటున్నారు. అస‌లు వీటిని జీఎస్టీ కిందికి తీసుకు రావాల‌ని తాము ఎప్ప‌టి నుంచో జీఎస్టీ కౌన్సిల్‌ను కోరుతున్నామ‌ని, దీనిపై తుది నిర్ణ‌యం తీసుకోవాల్సింది వాళ్లేన‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. అంత‌ర్జాతీయంగా ముడిచ‌మురు ధ‌ర‌లు పెర‌గ‌డం వ‌ల్లే ఇక్క‌డ ధ‌ర‌లు పెరుగుతున్నాయ‌ని, కొద్ది రోజుల్లో అవి త‌గ్గుతాయ‌ని ఆయ‌న అన్నారు. పైగా కొవిడ్ కార‌ణంగా ఉత్ప‌త్తి కూడా త‌గ్గ‌డం దీనికి మ‌రో కార‌ణ‌మ‌ని చెప్పారు. రెండు రోజుల విరామం త‌ర్వాత మంగ‌ళ‌వారం మ‌రోసారి పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు పెరిగిన విష‌యం తెలిసిందే. 

VIDEOS

logo