అదనంగా కట్నం అడిగిన వరుడు.. పెండ్లిలో చితకబాదిన వధువు కుటుంబం

లక్నో: అదనంగా కట్నం అడిగిన వరుడ్ని పెండ్లిలో వధువు బంధువులు చితకబాదారు. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. శుక్రవారం రాత్రి సాహిబాబాద్ ప్రాంతంలోని ఒక ఫంక్షన్ హాల్లో ఒక పెండ్లి వేడుక జరుగుతున్నది. ఆగ్రాకు చెందిన వరుడు ముజమ్మిల్ తండ్రి పెండ్లిలో పది లక్షల అదనపు కట్నం డిమాండ్ చేశాడు. లేకపోతే వివాహాన్ని ఆపివేస్తామని బెదిరించాడు.
కాగా, వధువు కుటుంబం అప్పటికే మూడు లక్షల కట్నంతోపాటు లక్ష విలువైన డైమండ్ రింగ్ను వరుడికి ఇచ్చింది. ఈ నేపథ్యంలో పెండ్లి సజావుగా జరిపించాలని వధువు కుటుంబ సభ్యులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే వరుడితోపాటు ఆయన కుటుంబ సభ్యులు ససేమిరా అన్నారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగింది.
దీంతో ఆగ్రహించిన పెండ్లి కుమార్తె కుటుంబ సభ్యులు పెండ్లి కొడుకుపై దాడి చేశారు. అంతా చూస్తుండగా వరుడ్ని చితకబాదారు. చివరకు వరుడి కుటుంబానికి చెందిన ఒక మహిళ జోక్యంతో ఈ వివాదం సద్దుమణిగింది. అనంతరం ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్కు చేరింది. కాగా, వరుడికి అప్పటికే రెండు మూడు వివాహాలు అయినట్లు వధువు కుటుంబం ఆరోపించింది.
మరోవైపు పెండ్లికి హాజరైన వారితోపాటు ఫంక్షన్ హాల్ సిబ్బంది తమ మొబైల్లో తీసిన దాడి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

