Noida | న్యూఢిల్లీ, జూన్ 4: లుంగీలు, నైటీలు ధరించి కామన్ ఏరియాల్లో తిరుగకూడదని గ్రేటర్ నోయిడాహౌసింగ్ సొసైటీ ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి దుస్తులు ధరించడం వల్ల ఇతరులు ఇబ్బందిపడుతున్నారని, అందుకే ఈ ఆదేశాలు జారీ చేస్తున్నామని తెలిపింది.
అయితే ఈ ఆదేశాలను వ్యతిరేకిస్తూ సొసైటీ నివాసులు ఆందోళనకు దిగారు. దుస్తులపై నిషేధం విధించడమేంటని నిలదీశారు.