న్యూఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించిన నిరసన(CJP Protest)లో పాల్గొన్న ఓ సెకండ్ ఇయర్ స్టూడెంట్‌కు గ్రేటర్ నోయిడా మెజిస్ట్రేట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ మెజిస్ట్రేట్‌ను సస్పెండ్ చేశారు. ఈ విషయాన్ని సొలిసిటర్ జనరల్ ఇవాళ సుప్రీంకోర్టులో పేర్కొన్నారు. గౌతం బుద్దా యూనివర్సిటీకి చెందిన ఆకాశ్ త్రిపాఠి అనే విద్యార్థి దాఖలు చేసిన రిట్ పిటీషన్‌పై స్పందిస్తూ ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది. భారతీయ నాగరిక సురక్షా సంహిత చట్టంలోని సెక్షన్ 130 కింది ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ఇచ్చిన ఆదేశాలను ఆ విద్యార్థి సవాల్ చేశాడు. సీజేపీ నిరసనలో పాల్గొన్న విద్యార్థి 5 లక్షల వ్యక్తిగత పూచీ చెల్లించాలని కూడా గ్రేటర్ నోయిడా ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆ ఆదేశాలను రద్దు చేశారు. సీజేఐ సూర్య కాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు సీనియర్ న్యాయవాది పీవీ దినేశ్ వాదిస్తూ.. ఆఫీసర్లకు ఈ కేసులో బలమైన సందేశం వెళ్లాలన్నారు.