ICC : కొలంబో టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లో శతకాలు బాదిన సోనాల్ దినుష(Sonal Dinusha) ఐసీసీ అవార్డు రేసులోకి వచ్చాడు. క్రీజులో గోడలా నిలిచి భారత జట్టు విజయాన్ని అడ్డుకున్న ఈ లెఫ్ట్‌హ్యాండర్ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ పురస్కారానికి నామినేట్ అయ్యాడు. ఆగస్టు నెలకుగానూ పురుషుల విభాగంలో ఈ లంక సంచలనం ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుకు పోటీ పడుతున్నాడు. ఆస్ట్రేలియాపై చరిత్రాత్మక విజయంలో భాగమైన బంగ్లాదేశ్ పేసర్ హసన్ మహమూద్, పాకిస్థాన్ నడ్డివిరిచిన ఓలీ రాబిన్సన్ సైతం బరిలో ఉన్నారు.
క్రికెట్లో అత్యుత్తమ ప్రదర్శనకు ప్రోత్సాహకంగా ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు అందిస్తున్న ఐసీసీ ఈసారి కూడా నామినేషన్లు స్వీకరించింది. ఆగస్టు నెలకుగానూ పురుషుల విభాగంలో శ్రీలంక ఆటగాడు సొనాల్ దినుష పోటీపడుతున్నాడు. అతడితో పాటు ఓలీ రాబిన్సన్(ఇంగ్లండ్ పేసర్), హసన్ మహమూద్(బంగ్లాదేశ్)లు నామినేట్ అయ్యారు.
🚨 BREAKING 🚨
Sonal Dinusha, Ollie Robinson, and Hasan Mahmud have been nominated for the ICC Player of the Month award for August! 🔥⏳#Cricket #Test #ICC pic.twitter.com/i9CM2Go01P
— Sportskeeda (@Sportskeeda) September 10, 2026
కొలంబో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 101తో మెరిసిన దినుష.. రెండో ఇన్నింగ్స్‌లోనూ క్రీజునంటుకుపోయి అజేయ శతకం(133 నాటౌట్)తో మ్యాచ్‌ను డ్రా చేశాడు. రెండు టెస్టుల్లో సంచలన బ్యాటింగ్ ప్రదర్శనతో 420 రన్స్ చేసినందున అతడి నామినేట్ అయ్యాడు. తొలి టెస్టులో 8/80 గణాంకాలతో పాక్ బ్యాటర్లను భయపెట్టిన ఈ పొడగరి పేసర్ లార్డ్స్ టెస్టులోనూ(8/35) నిప్పులు చెరిగాడు. సంచలన బౌలింగ్‌తో ఇంగ్లండ్ సిరీస్ విజయంలో కీలకమైన ఈ పొడగరి పేసర్ నామినేషన్ దక్కించుకున్నాడు. ఇక డార్విన్ టెస్టులో ఆస్ట్రేలియాపై చరిత్రాత్మక విజయంలో కీలకమైన హసన్‌కు నామినేషన్ దక్కింది. రెండు ఇన్నింగ్స్‌ల్లో రెచ్చిపోయిన అతడు.. 6/5, 3/56తో ఆసీస్‌ను దెబ్బకొట్టాడు.
🚨 𝗛𝗔𝗦𝗔𝗡 𝗠𝗔𝗛𝗠𝗨𝗗 𝗡𝗢𝗠𝗜𝗡𝗔𝗧𝗘𝗗 𝗙𝗢𝗥 𝗜𝗖𝗖 𝗣𝗟𝗔𝗬𝗘𝗥 𝗢𝗙 𝗧𝗛𝗘 𝗠𝗢𝗡𝗧𝗛 (August 2026) 🇧🇩
He has been nominated for the prestigious award for the first time, following his brilliance against Australia in Australia in Tests 💥
Other nominees: Sonal Dinusha… pic.twitter.com/MTDGlmCsaO
— Cricketangon (@cricketangon) September 10, 2026
మహిళల విభాగంలో ఆశ్చర్యంగా.. ఈసారి ఇద్దరు థాయ్‌లాండ్ క్రికెటర్లు బరిలో ఉన్నారు. సులీపొర్ట్ లోమి, నన్నాపట కొంచరొంకయ్లు నామినేట్ అయ్యారు. లూసీ బార్నెట్(ఇస్లే ఆఫ్ మ్యాన్) వీరికి గట్టిపోటీనిస్తోంది. ఇస్లే ఆఫ్ మ్యాన్ దేశం నుంచి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌కు నామినేట్ అయిన తొలి క్రికెటర్‌గా బార్నెట్ చరిత్ర సృష్టించింది.