కోదాడ, సెప్టెంబర్ 10 : కోదాడ పట్టణ రజక సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలను గురువారం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోదాడ పట్టణ మున్సిపల్ చైర్మన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాలు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పట్టణంలోని ప్రధాన రహదారిపై ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహానికి రజక సంఘం నాయకులతో కలిసి వారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ కుసుమ మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం నాడు భూస్వాములకు వ్యతిరేకంగా ఐలమ్మ చేసిన విరోచిత పోరాటం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. కాగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలవేసి జోహార్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో కోదాడ రజక సంఘం అధ్యక్షుడు సట్టు ఎల్లయ్య, కౌన్సిలర్ తోట శ్రీను, ఉపాధ్యక్షుడు సట్టు నాగేంద్ర, సురేష్, సతీష్, పిల్లుట్ల కిష్టయ్య, జక్కుల శివ, శేఖర్, వీర్యయ్య, లింగయ్య, సింహాచలం, భాస్కర్, భూమా శ్రీను, రజక సంఘం నాయకులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, పుర ప్రముఖులు పాల్గొన్నారు.

‘తెలంగాణ పోరాట స్ఫూర్తి చాకలి ఐలమ్మ’