తెహ్రీ (ఉత్తరాఖండ్) : తన మనవరాండ్ల కోసం ఒక బామ్మ ఏకంగా చిరుతపులితోనే పోరాడి వారిని రక్షించుకుంది. తెహ్రీ జిల్లా అబకి గ్రామంలోని 58 ఏండ్ల చంద్రమ్మ దేవి నాలుగేండ్ల తన ఇద్దరు మనవరాండ్లతో ఇంటి వరండాలో ఉండగా, చిరుతపులి వారిపై దాడి చేసింది. అప్రమత్తమైన చంద్రమ్మ దేవి చిరుతకు ఎదురుగా నిలిచి పోరాడింది. చిరుత ఆమెపై దాడి చేసి లాక్కుపోవడానికి ప్రయత్నించింది. అదే సమయానికి కుటుంబ సభ్యులు అక్కడికి రావడంతో భయపడి అక్కడి నుంచి పారిపోయింది. ప్రాణాలకు తెగించి మనవరాండ్లను రక్షించిన చంద్రమ్మ దేవిని పలువురు అభినందించారు.