న్యూఢిల్లీ: ఈ ఏడాదైనా వడ్డీ రేటును పెంచుతారని ఆశించిన ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్వో) చందాదారులకు నిరాశే ఎదురైంది. 2024-25 సంవత్సరానికి ఈపీఎఫ్వో నిల్వలపై వడ్డీ రేటును 8.25 శాతంగా కేంద్రం నోటిఫై చేసింది.
ఈపీఎఫ్వో సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ కొన్ని రోజుల క్రితం ప్రతిపాదించిన వడ్డీ రేటును యథాతథంగా కేంద్రం ఆమోదించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి కూడా ఇదే వడ్డీని కేంద్రం చెల్లించింది. త్వరలో 7 కోట్ల మంది చందాదారుల ఖాతాల్లో వడ్డీ జమ కానున్నది. ఖాతాల్లో జమ అయ్యిందో, లేదో చెక్ చేసుకోవడానికి ఉమంగ్ యాప్లో లాగిన్ కావొచ్చు.