జైపూర్: సిక్కుల ఊరేగింపులోకి ఒక వాహనం దూసుకెళ్లింది. (Vehicle Rams Into Sikh Procession) ఈ సంఘటనలో పలువురు గాయపడ్డారు. దీంతో సిక్కులు ఆగ్రహించారు. ఆ వాహనాన్ని ధ్వంసం చేశారు. దానిని నడిపిన ప్రభుత్వ అధికారి కుమారుడైన యువకుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్ రాజధాని జైపూర్లో ఈ సంఘటన జరిగింది. గురువారం సాయంత్రం జైపూర్లోని రాజా పార్క్ ప్రాంతంలో సిక్కులు ఊరేగింపు నిర్వహించారు. మతపర కీర్తనలో సుమారు 300 మంది ఇందులో పాల్గొన్నారు.
కాగా, సిక్కుల ఊరేగింపు వైపు థార్ ఎస్యూవీ దూసుకొచ్చింది. ఈ సంఘటనలో కొంతమంది గాయపడ్డారు. దీంతో ఆగ్రహించిన సిక్కులు ఆ వాహనాన్ని ధ్వంసం చేశారు. ఇది చూసి అందులో ఉన్న యువకులు అక్కడి నుంచి పారిపోయారు.
మరోవైపు డ్రైవింగ్ చేసిన ప్రభుత్వ అధికారి మైనర్ కుమారుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, కొందరు వ్యక్తులు రికార్డ్ చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
जयपुर के राजापॉर्क में! थार सवार की करतूत पर गुस्साया सिख समाज! #Jaipur pic.twitter.com/Jwv2z4zQYQ
— Ankit Tiwadi (@ankittiwadi) January 2, 2025