e-Shram Portal : అసంఘటిత కార్మికులకు ‘ఇ-శ్రామ్’ పోర్టల్ ప్రారంభం
e-Shram Portal : దేశంలోని అసంఘటిత కార్మికులను ఏకతాటిపైకి తీసుకొచ్చి వారి సమస్యలను విని పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఇ-శ్రామ్’ పోర్టల్‌ను ప్రారంభించింది. కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఈ పోర్టల్‌ను...

న్యూఢిల్లీ: దేశంలోని అసంఘటిత కార్మికులను ఏకతాటిపైకి తీసుకొచ్చి వారి సమస్యలను విని పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఇ-శ్రామ్’ పోర్టల్‌ను (e-Shram Portal) ప్రారంభించింది. కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఈ పోర్టల్‌ను గురువారం లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కార్మిక, ఉపాధి, పెట్రోలియం అండ్ సహజ వాయువుల మంత్రి రామేశ్వర్ తెలి సమక్షంలో అందజేశారు. అంతకుముందు ఆగస్టు 24 న ఇ-శ్రామ్ పోర్టల్ లోగోను భూపేందర్ యాదవ్ ఆవిష్కరించారు.
ఇ-శ్రామ్ పోర్టల్‌లో నమోదు చేసుకున్న తర్వాత అసంఘటిత కార్మికులు ప్రభుత్వ సామాజిక భద్రతా పథకాల కోసం విడిగా నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదు. 12 అంకెల యూఏఎన్ కలిగిన ఇ-శ్రామ్ కార్డ్ దేశవ్యాప్తంగా చెల్లుబాటు అవుతుంది. ఈ పోర్టల్‌లో పేర్ల నమోదు కార్యక్రమం కేంద్ర కార్మిక శాఖ, రాష్ట్రాల్లోని కార్మిక శాఖ, ట్రేడ్ యూనియన్స్ ద్వారా నిర్వహించనున్నారు. ఆధార్ కార్డ్, బ్యాంకు వివరాలతోపాటు వ్యక్తిగత వివరాలను అందజేయడం ద్వారా సభ్యత్వం పొందవచ్చు. ఈ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ కోరుకునే కార్మికుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పేందుకు, సమస్యలను పరిష్కరించడానికి జాతీయ టోల్ ఫ్రీ నంబర్ 14434 ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
‘దేశవ్యాప్తంగా 38 కోట్లకు పైగా ఉన్న అసంఘటిత రంగ కార్మికుల శ్రేయస్సు కోసం ఈ పోర్టల్‌ను తీసుకొచ్చాం. ఈ పోర్టల్ కేవలం రిజిస్ట్రేషన్ కోసమే కాకుండా అసంఘటి రంగ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని సామాజిక భద్రతా పథకాలు అందేలా చూస్తుంది. ఈ పోర్టల్ ద్వారా పేర్లను నమోదు చేసుకున్న కార్మికులకు రూ.2 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించడం పట్ల ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతున్నాం’ అని మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ఇటలీ విమానంలో మంటలు.. ప్రయాణికులు సురక్షితం
రాణె తల నరికి తెస్తే 51 లక్షల రివార్డ్ : విశ్వ హిందూ సేన
సాంకేతిక అంతరాల్లేని అంతర్జాల విద్య రావాలి: వెంకయ్యనాయుడు
ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా అజయ్ కుమార్
7,200 ఏండ్ల క్రితం మహిళ శరీరంలో డీఎన్ఏ గుర్తింపు
త్వరలో గూగుల్ పే ఆన్లైన్లో ఫిక్స్డ్ డిపాజిట్స్
సుప్రీంకోర్టుకు 9 మంది కొత్త జడ్జీలు
జైలులో కొత్త రకం శిక్ష వేశారు : అలెక్సీ నవాల్నీ
3 వేలకు వాటర్ బాటిల్.. 7 వేలకు ప్లేట్ అన్నం.. ఇదీ అక్కడి పరిస్థితి..!
బ్రిటీష్ వారిని దోచుకున్న విప్లవకారులు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

