ఈ నెల 30న ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం.. పార్లమెంట్ బడ్జెట్ సెషన్‌పై డిస్కషన్..!
All-party meeting | ఈ నెల 30న ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరగనుందని విశ్వసనీయ సమాచారం. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అన్ని పార్టీలతో ఈ నెల 30న సమావేశం కావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ మేరకు అన్ని పార్టీలకు ఆహ్వానం పంపనుందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
న్యూఢిల్లీ: ఈ నెల 30న ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరగనుందని విశ్వసనీయ సమాచారం. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అన్ని పార్టీలతో ఈ నెల 30న సమావేశం కావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ మేరకు అన్ని పార్టీలకు ఆహ్వానం పంపనుందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు, ఈ సమావేశాల సందర్భంగా ఉభయసభల్లో ప్రవేశపెట్టబోయే బిల్లులు, చేయబోయే చట్టాలు తదితర అంశాలపై ఆల్‌పార్టీ మీట్లో చర్చించే అవకాశం ఉన్నది.
కాగా, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 ప్రారంభమై ఏప్రిల్ 6న ముగియనున్నాయి. అయితే, ఈ తేదీల మధ్య ఏకధాటిగా కాకుండా రెండు విడతల్లో బడ్జెట్ సెషన్ కొనసాగనుంది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు తొలి విడత, మార్చి 6 నుంచి ఏప్రిల్ 6 వరకు రెండో విడత సమావేశాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 1న పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

