కట్నం కింద ఖరీదైన కారు ఇవ్వనందుకు.. పెళ్లిని రద్దు చేసిన కాలేజీ లెక్చరర్
పెళ్లికి నెల రోజుల ముందే కట్నం కింద ఖరీదైన కారు కొనివ్వాలని వరుడు డిమాండ్ చేశాడు.
లక్నో: కట్నం కింద ఖరీదైన కారు ఇవ్వనందుకు ప్రభుత్వ కాలేజీ లెక్చరర్ ఏకంగా పెళ్లిని రద్దు చేశాడు. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో ఈ సంఘటన జరిగింది. విజయ్నగర్లోని సిద్ధార్థ్ విహార్లో నివసిస్తున్న ఒక వ్యక్తి ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తున్నాడు. గత ఏడాది మేలో ఒక మహిళతో అతడికి పెళ్లి సంబంధం కుదిరింది. ఆ ఏడాది జూన్ 19న నిశ్చితార్థం జరిగింది. ఈ ఏడాది జనవరి 30న వివాహం జరిపేందుకు ఇరు కుటుంబాలు నిర్ణయించాయి.
కాగా, పెళ్లికి నెల రోజుల ముందే కట్నం కింద ఖరీదైన కారు కొనివ్వాలని వరుడు డిమాండ్ చేశాడు. ఈ నేపథ్యంలో వధువు కుటుంబం అక్టోబర్ 10న వాగనార్ను బుక్ చేసింది. అయితే తమకు ఫార్చ్యూనర్ కారు కావాలని వరుడి కుటుంబం డిమాండ్ చేసింది. అంత ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చేందుకు వధువు కుటుంబం నిరాకరించింది. ఈ నేపథ్యంలో నవంబర్ 23న పెళ్లిని రద్దు చేసుకుంటున్నట్లు వధువు ఫోన్కు వరుడు మెసేజ్ పంపాడు. దీంతో వధువు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా వరుడు, అతడి కుటుంబంపై వరకట్నం చట్టం, ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

