Toll Tax | న్యూఢిల్లీ, నవంబర్ 28: జాతీయ రహదారులపై పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ) విధానంలో నిర్వహిస్తున్న ప్లాజాల ద్వారా 2000 డిసెంబర్ నుంచి ప్రభుత్వం రూ.1.44 లక్షల కోట్లు టోల్ ట్యాక్స్‌గా వసూలు చేసినట్టు మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. లోక్‌సభలో ఒక ప్రశ్నకు ఆయన రాతపూర్వకంగా సమాధానమిచ్చారు.
ప్రస్తుతం అమలవుతున్న ఫాస్ట్‌టాగ్‌కు అదనంగా, ఎలాంటి ఆటంకం లేకుండా ముందుకు సాగేందుకు వీలుగా ఎలక్ట్రానిక్ టెక్నాలజీ కలెక్షన్ (ఈటీసీ) సాంకేతికత అమలును ప్రారంభించినట్టు చెప్పారు. గ్లోబల్ నేవిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (జీఎన్ఎస్ఎస్) ఆధారిత విధానం ప్రస్తుతం ఏ జాతీయ రహదారులపై అమలు చేయడం లేదని ఆయన తెలిపారు.
ఆ విధానంలో అప్పటివరకు ఆ వాహనం జాతీయ రహదారి లేదా ఎక్స్‌ప్రెస్ వేలపై ప్రయాణించిన వాస్తవ దూరాన్ని ఆధారంగా రుసు ము వసూలు చేసేవారని, కానీ ప్రస్తు త విధానం ప్రకారం ప్లాజా ప్రాజెక్టు పొడవును ఆధారంగా ఫీజు వసూలు చేస్తున్నట్టు ఆయన చెప్పారు.