న్యూఢిల్లీ : నిన్నమొన్నటివరకూ కొండెక్కిన టమాటాల ధరలు దిగివచ్చాయి. ఆగస్ట్ 15 నుంచి టమాటాలను కిలో రూ. 50కి విక్రయించాలని నేషనల్ కోఆపరేటివ్ కన్జూమర్స్ ఫెడరేషన్ (ఎన్సీసీఎఫ్), నాఫెడ్లను కేంద్ర ప్రభుత్వం సోమవారం ఆదేశించింది.
హోల్సేల్ మార్కెట్లలో టమాటాల ధరలు తగ్గుముఖం పట్టడంతో వినియోగదారుల వ్యవహారాల శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఎన్సీసీఎఫ్, నాఫెడ్ పలు ప్రాంతాల్లో తగ్గింపు ధరలకు టమాటాలను విక్రయిస్తున్నాయి. ఆగస్ట్ 13 నాటికి ఎన్సీసీఎఫ్, నాఫెడ్లు కలిపి 15 లక్షల కిలోల టమాటాలను సేకరించాయి.
Read More :
Sun with spots | మచ్చలేని సూర్యుడు కాదు.. ఈ ఏడాది ఇప్పటిదాకా మచ్చలేని రోజే లేదు..!