న్యూఢిల్లీ: 2025-26 మార్కెటింగ్ సీజన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం గోధుమ సహా 6 రబీ పంటల కనీస మద్దతు ధరను (ఎమ్మెస్పీ) పెంచింది. కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ ఈ విషయం వెల్లడించారు. క్వింటాల్ గోధుమ ధరను రూ.150, ఆవాల ధరను రూ.300, పెసర్ల ధరను రూ.275, శెనగల ధరను రూ.210, పొద్దుతిరుగుడు ధరను రూ.140, బార్లీ ధరను రూ.130 చొప్పున పెంచినట్టు తెలిపారు.
జాన్సన్ అండ్ జాన్సన్‌కు రూ.126 కోట్ల జరిమానా
న్యూఢిల్లీ: ప్రముఖ హెల్త్‌కేర్ సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్‌కు భారీ షాక్ తగిలింది. దశాబ్దాలుగా ఆ సంస్థకు చెందిన పౌడర్‌ను వాడటం వల్ల తనకు క్యాన్సర్ వచ్చిందంటూ ఒక వ్యక్తి వేసిన దావాకు స్పందించిన ట్రయల్ కోర్టు నష్టపరిహారంగా సుమారు రూ.126 కోట్లు అతడికి చెల్లించాలని తీర్పు చెప్పింది. కంపెనీకి చెందిన బేబీ పౌడర్ వల్ల తనకు ఈ వ్యాధి వచ్చిందని ప్లాట్కిన్ ఇవాన్ అనే వ్యక్తి 2021లో దావా వేశారు.