dope tests | పైలట్లకు ప్రతి ఏడాది డోప్ టెస్టులు.. ఎయిరిండియా విమాన ఘటన నేపథ్యంలో నిర్ణయం
dope tests : ఇకపై పైలట్లకు ప్రతి ఏడాది డోప్ టెస్టులు నిర్వహించనున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ విషయాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మంగళవారం వెల్లడించారు.
dope tests : ఇకపై పైలట్లకు ప్రతి ఏడాది డోప్ టెస్టులు నిర్వహించనున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ విషయాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మంగళవారం వెల్లడించారు. ప్రస్తుతం ఈ అంశంపై డీజీసీఏ (ద డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) దృష్టి సారించిందని, దీనికి సంబంధించి ఇప్పటికే ఉన్న నిబంధనల్ని పరిశీలిస్తోందని మంత్రి అన్నారు.
అలాగే, కొత్త నిబంధనల రూపకల్పనపై దృష్టి సారించిందని తెలిపారు. ఇటీవల ఎయిరిండియా విమానం గాలిలో ఉండగా, కుదుపులకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. దీనికి గల కారణాలపై విచారించగా.. పైలట్ గంజాయి సేవించినట్లు తేలింది. పైలట్లు మత్తులో ఉండటం వల్ల విమాన ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు ఉంటుంది. అందువల్ల పైలట్లు ఇలా నిషేధిత డ్రగ్స్ తీసుకోకుండా చర్యలు తీసుకోవాలని, అలాంటి వారిని గుర్తించేందుకు డోప్ టెస్టులు నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది.
నిజానికి దీనికి సంబంధించి ఎప్పటినుంచో ఈ రూల్ ఉంది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం.. పైలట్లలో 10 శాతం మందికి మాత్రమే ప్రతి ఏడాది డోప్ టెస్టులు నిర్వహించాలి. అయితే, ఇకపై ప్రతి పైలట్‌కు ఏడాదికోసారి తప్పనిసరిగా డోప్ టెస్ట్ నిర్వహించాలని భావిస్తోంది. అంటే, 100 శాతం మంది పైలట్లకు డోప్ టెస్టు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. భద్రత, నిర్వహణపరమైన అంశాల్ని పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన వివరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AINRC: పుదుచ్చరి ఉప ఎన్నికలో ఏఐఎన్ఆర్సీ పార్టీ విజయం
Godavari water | గోదావరి జలాలు విడుదల చేయాలని పురుగుల మందు డబ్బాలతో రైతుల ధర్నా
రాయపోల్ నూతన ఎస్ఐకి ఘన సన్మానం!
Jason Sanjay | సీఎం విజయ్ కొడుకు హీరోగా ఎంట్రీ?.. లైకా ప్రొడక్షన్స్‌తో చర్చలు!
Delhi Metro Stations: అక్టోబర్ 10 నిరసన నేపథ్యంలో.. 57 మెట్రో స్టేషన్లు మూసివేత !
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

