న్యూఢిల్లీ, ఆగస్టు 19: పాస్పోర్టు సేవలకు సంబంధించి ఆరు నకిలీ వెబ్సైట్లను గుర్తించామని కేంద్రం తెలిపింది. ఈ నకిలీ వెబ్సైట్లు అభ్యర్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్టు, కీలక సమాచారాన్ని సేకరిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని వెల్లడించింది.
కాబట్టి ఈ ఆరు నకిలీ వెబ్సైట్లలో (www.indiapassport. org, www.online passpor tindia.com,www.passportindia.in,www.passport seva.in, www.applypass port.org, www.passport indiaportal.in) పాస్పోర్టు కోసం దరఖాస్తు చేయవద్దని సూచించింది.