Fact Check: రాజౌరీ ఆర్మీ బ్రిగేడ్పై సూసైడ్ దాడి.. ఫేక్ న్యూస్ అని పేర్కొన్న ప్రభుత్వం
Fact Check: జమ్మూకశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో ఆర్మీ బ్రిగేడ్పై సూసైడ్ దాడి జరిగినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది. పంజాబ్‌లోని జలంధర్‌పై డ్రోన్ అటాక్ జరిగినట్లు కూడా వస్తున్న వార్తలను ఫేక్ న్యూస్‌గా కేంద్రం ప్రకటించింది.
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో ఆర్మీ బ్రిగేడ్పై సూసైడ్ దాడి జరిగినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది. పంజాబ్‌లోని జలంధర్‌పై డ్రోన్ అటాక్ జరిగినట్లు కూడా వస్తున్న వార్తలను ఫేక్ న్యూస్‌గా కేంద్రం ప్రకటించింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్(Fact Check) యూనిట్ దీనిపై వివరణ ఇచ్చింది. ఆర్మీ కంటోన్మెంట్‌పై ఫిదాయిన్ లేదా సూసైడ్ దాడి జరగలేదని పీఐబీ వెల్లడించింది. జలంధర్‌లో డ్రోన్ దాడి కేవలం వ్యవసాయ క్షేత్రంలోని మంటలు మాత్రమే అని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ చెప్పింది. జలంధర్ జిల్లా కలెక్టర్ ఎటువంటి డ్రోన్ దాడి జరగలేదని చెప్పినట్లు పీఐబీ పేర్కొన్నది.
Drone Attack in Jalandhar⁉️
This drone strike video from #Jalandhar is widely circulating on social media#PIBFactCheck
* This is an unrelated video of a farm fire. The video has the time 7:39 PM, while the drone attack began later.
* Do not share this video. See the… pic.twitter.com/IRBjq2KOTQ
— PIB Fact Check (@PIBFactCheck) May 8, 2025
మే 8వ తేదీ రాత్రి పది గంటల నుంచి మే 9వ తేదీ ఉదయం 6.30 నిమిషాల వరకు మొత్తం ఏడు వీడియోలను పరిశీలించామని, ఫ్యాక్ట్ చెక్ చేసిన వీడియోలు, వాటి లింక్‌లను సేకరించినట్లు పీఐబీ తెలిపింది. ఇండియాపై మిస్సైల్ దాడి జరిగినట్లు ప్రచారం అవుతున్న ఓ పురాతన వీడియోపై కూడా పీఐబీ క్లారిటీ ఇచ్చింది. వాస్తవానికి ఆ మిస్సైల్ దాడి 2020లో లెబనాన్‌లోని బీరట్‌లో జరిగిన పేలుడు ఘటన అని ప్రభుత్వం పేర్కొన్నది. ఇండియన్ ఆర్మీ పోస్టును పాకిస్థానీ దళాలు ధ్వంసం చేసినట్లు ప్రచారం అవుతున్న మరో వీడియో కూడా ఫేక్ అని ప్రభుత్వం తేల్చింది.
భారతీయ సైన్యంలో 20 రాజ్ బెటాలియన్ అనే యూనిట్ లేదని ఫ్యాక్ట్ చెక్ పేర్కొన్నది. కొందరు సోషల్ మీడియా ద్వారా, పాకిస్థాన్‌లోని ప్రధాన మీడియా కూడా..భారత ప్రజల్లో భయాందోళనలు కలిగించే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు పీఐబీ తన స్టేట్మెంట్లో పేర్కొన్నది.
🚨 Staged Video Alert 🚨
Fake video is being circulated by Pakistani handles alleging that an Indian Post was destroyed by the #Pakistani Army
✅ The claim is completely false, and the video is staged
❌ There is no unit called “20 Raj Battalion” in the… pic.twitter.com/959rc9OrTH
— PIB Fact Check (@PIBFactCheck) May 8, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Premada Oorali | రూ.2 కోట్ల బడ్జెట్‌తో సినిమా,బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్ల వసూళ్లు.. ‘ప్రేమద ఊరాలి’ సంచలనం
AP News | అమెరికాలో మాజీ ఎమ్మెల్యే గఫూర్ కుమారుడు మృతి
Tushar Gandhi | నిరసనలో పాల్గొనేందుకు వెళ్తుండగా మహాత్మాగాంధీ మునిమనువడు అరెస్ట్..!
Dhruv Rathee | సీజేపీ నిరసనకు వెళ్లకుండా యూట్యూబర్ ధృవ్ రాఠీని అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు
Vitamin D | ఎముకలే కాదు, గుండె ఆరోగ్యాన్ని సైతం కాపాడే విటమిన్ డి.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

