న్యూఢిల్లీ, జనవరి 16: బెట్టింగ్, జూదాన్ని ప్రోత్సహిస్తూ యువత, ప్రజలను పెడదోవ పట్టిస్తున్న 242 ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ వెబ్సైట్లపై కేంద్రం కొరడా ఝళిపించింది. అనుమానాస్పద డిజిటల్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లను మూసివేసే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ అక్రమ ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ సైట్లను బ్లాక్ చేసింది.
ఈ సైట్ల బారిన పడి పలువురు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారని, ప్రజలను, ముఖ్యంగా యువతను ఈ గేమింగ్ల బారిన పడకుండా రక్షించేందుకు ఈ చర్యలు చేపట్టినట్టు ఒక అధికారి తెలిపారు. ఇప్పటివరకు దేశంలో 7,800 అక్రమ జూద, గేమింగ్ వెబ్సైట్లను ప్రభుత్వం నిషేధించింది.