రాయ్‌పూర్: ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అయితేనేం జనాల్లో ఇట్టే కలిసిపోతారు. సాంప్రదాయ పండుగల్లో ప్రజలతో కలిసి పాల్గొంటారు. కొరడాతో కొట్టించుకుంటారు.. సంగీతం వాయిధ్యాలు (musical instrument) వాయిస్తారు. ఆయనే ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్.
దుర్గ్‌లోని జరిగిన గోవర్ధన్ పూజ (Govardhan Puja)లో సీఎం బఘేల్ పాల్గొన్నారు. ఇందులో భాగంగా గోవుకు విశిష్టమైన పూజలు చేస్తారు. ఆ తర్వాత భక్తులు కొరడాతో కొట్టించుకుంటారు. ఇలా గోవర్ధన్ పూజ అనంతరం కొరడా దెబ్బలు తింటే సమస్యలు తొలగిపోతాయని స్థానికుల నమ్మకం. ఈ క్రమంలో శుక్రవారం జంజిగిరి గ్రామంలో గోవర్ధన్ పూజకు హాజరైన బఘేల్ కొరడా దెబ్బలు తిన్నారు.
తర్వాత రాయ్‌పూర్‌లో జరిగిన గోవర్ధన్ పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాకారులతో కలిసి హుషారుగా సంగీత వాయిధ్యాలు (musical instrument) వాయించారు. సంప్రదాయ దుస్తులు ధరించిన సీఎం బఘేల్.. సంగీతం వాయిస్తుండగా మరో నాయకుడు డ్యాన్స్ చేశారు.
#WATCH | Chhattisgarh CM Bhupesh Baghel was seen playing a musical instrument with artists at a 'Govardhan Puja' event in Raipur on November 5 pic.twitter.com/ij24dzQMj7
— ANI (@ANI) November 5, 2021
#WATCH | Chhattisgarh Chief Minister Bhupesh Baghel getting whipped as part of a ritual on the occasion of Govardhan Puja in Durg pic.twitter.com/38hMpYECmh
— ANI (@ANI) November 5, 2021