About The Image |న్యూఢిల్లీ : యూజర్లకు నాణ్యమైన సమాచారాన్ని అందివ్వాలని నిర్ణయించుకున్న గూగుల్ ‘అబౌట్ దిస్ ఇమేజ్’ అనే ఫ్యాక్ట్ చెక్ టూల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫొటోల క్రెడిబిలిటీని ఈ టూల్ ద్వారా నిర్ధారించుకోవచ్చు.
ఫొటో చరిత్ర, మెటా డాటాతోపాటు వేర్వేరు సైట్లలో దీనిని ఎవరెవరు ఉపయోగించారు అన్న వివరాలను కూడా ఒక్క క్లిక్‌తో యూజర్లు తెలుసుకునే వీలుంటుంది. ఇమేజ్‌పైన కనిపించే మూడు డాట్లపై క్లిక్ చేయడం ద్వారా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.