న్యూఢిల్లీ: టెలిగ్రామ్ యాప్(Telegram App) మళ్లీ ప్రారంభమైంది. ఆ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్‌లో మళ్లీ రిస్టోర్ చేశారు. నీట్ యూజీ రీఎగ్జామ్ నేపథ్యంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్ యాప్‌ను బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. జూన్ 21వ తేదీన నీట్ పరీక్ష జరిగింది. అయితే జూన్ 22వ తేదీన వరకు ఆ యాప్‌ను బ్లాక్ చేశారు. ఇవాళ ఉదయం నుంచి కొందరు యూజర్లకు టెలిగ్రామ్ యాప్ అందుబాటులోకి వచ్చేసింది. గూగుల్ రిస్టోర్ చేయకముందే కొందరు దాన్ని వాడడం ప్రారంభించారు. కానీ యాపిల్ ఆప్ స్టోర్‌లో మాత్రం ఇంకా డీలిస్టు కేటగిరీలోనే ఆ యాప్ ఉన్నట్లు తెలుస్తోంది. యాపిల్ సంస్థ దీనిపై స్పందించేందుకు నిరాకరించింది.
టెలిగ్రామ్ యాప్ బ్యాన్ అంశంపై తాత్కాలిక నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం చెప్పింది. నీట్‌కు చెందిన ఫేక్ పేపర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కారణంగా.. ముఖ్యంగా టెలిగ్రామ్ యాప్‌ను బ్యాన్ చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొన్న విషయం తెలిసిందే. జూన్ 3వ తేదీన టెలిగ్రామ్ ప్రతినిధులతో భేటీ నిర్వహించిన తర్వాత బ్యాన్ ప్రకటన చేశారు. టెలిగ్రామ్ యాప్‌తో పాటు అనుబంధ వెబ్ లింకులను కూడా బ్లాక్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వెబ్ వర్షన్‌ను కూడా ఆపేశారు. జూన్ 30వ తేదీ వరకు టెలిగ్రామ్ మెసేజ్ ఎడిటింగ్ ఆప్షన్‌ను కూడా బ్లాక్ చేసిన విషయం తెలిసిందే.