న్యూఢిల్లీ: రెండేండ్ల నుంచి ఇనాక్టివ్‌గా ఉన్న వ్యక్తిగత జీమెయిల్ ఖాతాలను సెప్టెంబర్ 20 నుంచి తొలగించాలని గూగుల్ నిర్ణయించింది. సర్వర్ నిర్వహణను ఆప్టిమైజ్ చేయడానికి దీనిని అమలు చేయనుంది. అయితే కేవలం వ్యక్తిగత జీమెయిల్ అకౌంట్లకే దీన్ని వర్తింపజేయనుంది.
ఈ-మెయిల్ పంప డం లేదా చదవడం, గూగుల్ ఫొటోస్‌లో ఫొటో అప్లోడ్ చేయ డం లేదా షేర్ చేయడం, యూ ట్యూబ్ వీడియో చూడటం, గూగు ల్ డ్రైవ్‌ను ఉపయోగించడం లేదా దాని ద్వారా సెర్చ్ చేయడం ద్వారా తొలగింపును తప్పించు కోవచ్చు.