watch: లోకో పైలట్ లేకుండా.. పట్టాలపై పరుగులు తీసిన గూడ్స్ రైలు
Goods train runs without loco pilot | లోకో పైలట్ లేకుండానే ఒక గూడ్స్ రైలు పట్టాలపై పరుగులు తీసింది. వంద కిలోమీటర్ల వేగంతో సుమారు 80 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. ఇది చూసి అంతా షాక్ అయ్యారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
చండీగఢ్: లోకో పైలట్ లేకుండానే ఒక గూడ్స్ రైలు పట్టాలపై పరుగులు తీసింది. వంద కిలోమీటర్ల వేగంతో సుమారు 80 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. (Goods train runs without loco pilot) ఇది చూసి అంతా షాక్ అయ్యారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రైలు సిబ్బంది డ్యూటీ మారేందుకు జమ్ముకశ్మీర్‌లోని కథువా స్టేషన్లో గూడ్స్ రైలును ఆపారు. హ్యాండ్ బ్రేక్ వేయడం మరిచిన లోకో పైలట్, కో పైలట్ రైలు ఇంజిన్ నుంచి కిందకు దిగారు. అయితే పట్టాలు వాలుగా ఉండటంతో ఆ గూడ్స్ రైలు ముందుకు కదిలించి. కంకర, రైలు సామగ్రి వంటివి ఉన్న ఆ గూడ్స్ రైలు సుమారు వంద కిలోమీటర్ల వేగం అందుకుంది. జమ్ముకశ్మీర్‌లోని కథువా, పంజాబ్‌లోని పఠాన్‌కోట్ మార్గంలోని ఐదు స్టేషన్ల మీదుగా అది ప్రయాణించింది.
కాగా, ఈ విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ మార్గంలోని అన్ని రైల్వే, రోడ్డు క్రాసింగ్‌లు మూసివేశారు. అలాగే గూడ్స్ రైలు వేగాన్ని తగ్గించేందుకు మెకానికల్ పద్ధతులు చేపట్టారు. రైలు పట్టాలపై చెక్క దిమ్మెలు కూడా ఏర్పాటు చేశారు. ఈ చర్యల వల్ల పంజాబ్ దసుయాలోని ఉంచి బస్సీ సమీపంలో ఆ గూడ్స్ రైలు ఆగింది. లోకో పైలట్ లేకుండా గూడ్స్ రైలు పట్టాలపై పరుగులు తీసిన సమయంలో ఎదురుగా ఏ రైలు రాకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ సంఘటనపై రైల్వే అధికారులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#pathankot
बिना ड्राइवर के चल पड़ी मालगाड़ी; रेलवे ने कड़ी में मशक्कत के बाद रोका.
पठानकोट के निकट कठुआ के पास से बगैर ड्राइवर की एक मालगाड़ी अनियंत्रित होकर दौड़ पड़ीरेलवे अधिकारियों द्वारा काफी मशक्कत के बाद आखिरकार होशियारपुर के निकट दसुआ के पास ट्रेन को रोक पाने में कामयाबी. pic.twitter.com/RoXSOuig5d— karan Kapoor (@karankapoor_ani) February 25, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

