న్యూఢిల్లీ: గుజరాత్‌లోని వల్సాద్‌లో శుక్రవారం ఓ గూడ్స్ రైలు వ్యాగన్ పట్టాలు తప్పింది. దీంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని, మరమ్మతు, సహాయక చర్యలు చేపట్టారు. వర్షం కురుస్తుండటంతో ఈ చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు చెప్పారు. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని తెలిపారు.