ముంబై: గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. (Goods Train Derails) నాలుగు వ్యాగన్లు పూర్తిగా పట్టాలు తప్పినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ సంఘటన వల్ల రైళ్ల రాకపోకలపై ఎలాంటి ప్రభావం లేదని చెప్పారు. అయితే గూడ్స్ రైలు పట్టాలు తప్పిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మహారాష్ట్రలోని పాల్గఢ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శనివారం బోయిసర్ స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. నాలుగు వ్యాగన్లు ట్రాక్ తప్పినట్లు రైల్వే అధికారులు తెలిపారు. లోకల్, మిగతా రైళ్లపై ఎలాంటి ప్రభావం పడలేదని పశ్చిమ రైల్వే సీపీఆర్వో చెప్పారు. అయితే పట్టాలు తప్పిన గూడ్స్ రైలు వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, వారం రోజుల్లో పలు గూడ్స్ రైళ్లు పట్టాలు తప్పాయి. జూలై 20న ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్, మొరాదాబాద్ సెక్షన్ల మధ్య గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. జూలై 21న పశ్చిమ బెంగాల్‌లోని నాడియా జిల్లా రానాఘాట్‌లోని గూడ్స్ వార్డులో షంటింగ్ సమయంలో గూడ్స్ రైలుకు చెందిన గార్డు కోచ్ పట్టాలు తప్పింది. అదే రోజున రాజస్థాన్‌లోని అల్వార్ గూడ్స్ స్టేషన్ నుంచి రేవారీకి వెళుతున్న సరుకు రవాణా రైలు మథుర ట్రాక్‌పై పట్టాలు తప్పింది. జూలై 26న ఒడిశాలోని భువనేశ్వర్ రైల్వే స్టేషన్ సమీపంలో అంగుల్ వెళుతున్న గూడ్స్ రైలుకు చెందిన రెండు వ్యాగన్లు పట్టాలు తప్పాయి.
Palghar, Maharashtra: At Boisar railway station, several freight train cars derailed but fortunately, the slow speed prevented a major accident. There was no impact on Western Railway’s operations. Officials are on-site and work is underway to return the carriage to the track pic.twitter.com/7bYVq9n9qZ
— IANS (@ians_india) July 27, 2024