గాంధీనగర్, నవంబర్ 6: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ మంత్రి జేఎన్ వ్యాస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. పార్టీలో ఫ్యాక్షనిజం పెరిగిపోయిందని, కొందరు నాయకులను కావాలనే టార్గెట్ చేస్తున్నారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యంగా పఠాన్ ప్రాంతంలో ఈ ఫ్యాక్షన్ వ్యవహారం తీవ్రంగా ఉన్నదని విమర్శించారు. వ్యాస్ 2007 నుంచి 2012 వరకు మోదీ క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు.