బెంగళూరు, ఏప్రిల్ 27: కర్ణాటకలో సీఎం మార్పు అంశం మళ్లీ తెరపైకి వ చ్చింది. రాష్ట్ర నేతలతో కాంగ్రెస్ అధిష్ఠానం వరుస భేటీలు ఊహాగానాలకు తావిస్తున్నాయి. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు మే 15న గుడ్ న్యూస్ అందుతుంది.. అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే రంగనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆయన వ్యాఖ్యలు రాష్ట్రంలో నా యకత్వ మార్పునకు సరికొత్త చర్చను లేవనెత్తింది. ‘కాంగ్రెస్ కోసం డీకే ఎంతో కృషి చేశారు. ప్రతి విషయంలో తన శాయశక్తులా శ్రమించారు. అధిష్ఠా నం సరైన గుర్తింపు ఇస్తుందని నమ్ముతున్నా. డీకే జన్మదినం మే 15న కచ్చితంగా ఒక శుభవార్త వస్తుందని భావిస్తున్నా’ అని రంగనాథ్ అన్నారు.