Gold Mines | ఒడిశాలోని మూడు జిల్లాల్లో బంగారు గనులు.. గుర్తించిన జీఎస్ఐ
ఒడిశాలోని (Odisha) మూడు జిల్లాల్లో బంగారు గనులు (Gold Mines) బయటపడ్డాయి. రాష్ట్రంలోని కియోంఝర్ జిల్లా, మయూర్భంజ్, డియోగఢ్ జిల్లాల్లో గనులను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI), డైరెక్టరేట్ ఆఫ్ మైన్‌కు చెందిన సర్వేయర్లు గుర్తించారని మంత్రి ప్రఫుల్లా మల్లిక్ (Prafulla Mallik) అసెంబ్లీలో వెల్లడించారు.
భువనేశ్వర్: ఒడిశాలోని (Odisha) మూడు జిల్లాల్లో బంగారు గనులు (Gold Mines) బయటపడ్డాయి. రాష్ట్రంలోని కియోంఝర్ జిల్లా, మయూర్భంజ్, డియోగఢ్ జిల్లాల్లో గనులను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI), డైరెక్టరేట్ ఆఫ్ మైన్‌కు చెందిన సర్వేయర్లు గుర్తించారని మంత్రి ప్రఫుల్లా మల్లిక్ (Prafulla Mallik) అసెంబ్లీలో వెల్లడించారు. కియోంజఝర్ జిల్లాలో నాలుగు చోట్ల గనులు బయటపడగా, మయూర్‌భంజ్‌లో నాలుగు, డియోగఢ్ జిల్లాలో ఒక చోట బంగారు గనులను గుర్తించారని తెలిపారు.
దేశంలో మొట్టమొదటిసారిగా లిథియం నిల్వలను జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ) గుర్తించిందని కేంద్ర గనుల శాఖ ఫిబ్రవరి 10న ప్రకటించిన విషయం తెలిసిందే. జమ్ముకశ్మీర్‌లోని రియాసి జిల్లాలో గల సలాల్-హైమనా ప్రాంతంలో 5.9 మిలియన్ టన్నుల లిథియం నిక్షేపాలను గుర్తించినట్టు పేర్కొంది. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలని ప్రభుత్వాలు భావిస్తున్న నేపథ్యంలో లిథియం నిల్వలు లభించడం మేలు చేయనుంది. కాగా, బంగారం, లిథియం సహా మొత్తం 51 గనులను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించినట్టు గనుల శాఖ వెల్లడించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Deogarh
- Gold mines
- GSI
- Keonjhar
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

