పనాజీ, నవంబర్ 30: గోవా సీఎం ప్రమోద్ సావంత్ వ్యక్తిగత జీమెయిల్ ఖాతా హ్యాకింగ్‌కు గురైందని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు శనివారం తెలిపారు. ‘గోవా పోలీస్ శాఖలోని సైబర్ క్రైమ్ సెల్ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి చర్యలు చేపట్టారు. ఐదు గంటల తర్వాత సీఎం వ్యక్తిగత జీమెయిల్ ఐడీని తిరిగి పునరుద్ధరించారు’ అని సదరు అధికారి వెల్లడించారు. హ్యాకర్ ఎవరన్నది తేల్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన అన్నారు. ఈనెల 19న జరిగిన హ్యాకింగ్‌పై దర్యాప్తు చేస్తున్నామని, సీఎం మెయిల్ ఖాతాకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని సీనియర్ అధికారి తెలిపారు.